ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరవ తాండ గ్రామంలోని కిరణా దుకాణంలో గ్యాస్ లీక్ కావడం వల్ల మంటలు చెలరీగాయి. గురువారం మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే లక్ష రూపాయల వరకు విలువ చేస్తే వస్తువులు కాలిపోయాయని అంతేకాకుండా విలువైన ఫ్రిడ్జ్ మరియు వస్తువులు కాలిపోయినట్లుగా దుకాణదారులు తెలిపారు. సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.