హైదరాబాదులో కనీసం వీధిలైట్లు కల్పించలేని దౌర్భాగ్యస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ అంటే ఒక హైటెక్ సిటీ, రియల్ ఎస్టేట్ ప్రాంతం కాదని పాత హైదరాబాద్లో ఏ గల్లీకి వెళ్లిన సమస్యలు తాండవిస్తున్నాయని ఆరోపించారు. కాలనీలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.