సఖినేటిపల్లి మండలం గుడిమూలలో నాలుగు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... ఈ సబ్ స్టేషన్ వల్ల సఖినేటిపల్లి, సఖినేటిపల్లి లంక, గుడిమూల,గొంది అంతర్వేది గ్రామాల్లో పవర్ కట్, లోవోల్టేజి సమస్యలన్నీ తొలగిపోతాయని అన్నారు.