కర్నూలు ప్రెస్‌క్లబ్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన కర్నూలు నగరంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ప్రెస్‌క్లబ్ కోసం పోరాడుతున్నారని, చివరికి కలెక్టర్ రంజిత్‌భాష ప్రెస్‌క్లబ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి సమాజానికి సేవ చేస్తున్న తరుణంలో, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.కర్నూలు ప్రెస్‌క్లబ్‌ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దితే, జ