సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి చెప్పుకోవడానికి శుక్రవారం ప్రజా భవన్ కు వెళ్తున్న క్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులను సింగరేణి వ్యాప్తంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేతనాలు పెంచాలని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తారా ఇదే ప్రజాపాలన అంటూ పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.