తోటపల్లి బ్రాంచి కాలువ పిరిడి నుండి నందబలగ 12 గ్రామాల భూములకు సాగునీరు సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకున్నందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. రాంబాబు తెలిపారు. ఆగష్టు 1వ తేదీన సమస్యను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.