ఆలూరులో మంగళవారం వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బుసినేని వీరపాక్షి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం సమాజానికి న్యాయం, ధర్మం, నీతి విలువలను నేర్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, వాల్మీకి సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.