Udayagiri, Sri Potti Sriramulu Nellore | Oct 2, 2025
ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఉదయగిరి శ్రీశ్రీశ్రీ సంతాన లక్ష్మీదేవి పేరంటాలమ్మ ఆలయ ప్రాంగణంలో విజయదశమి సందర్భంగా మహా చండీయాగం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేపట్టి హోమం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హోమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.