తాడ్వాయి మండలంలో గర్భిణీ స్త్రీ అంబులెన్స్ లో బుధవారం సాయంత్రం ప్రసవించింది. కాల్వపల్లి గుత్తి కోయగూడెంకు చెందిన మాడవి చుక్కమ్మ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ 108కు సమాచారం అందించారు. మేడారం 108 సిబ్బంది ఈఎంటీ మధు, పైలట్ కరుణాకర్లు గర్భిణీ స్త్రీని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే క్రమంలో పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ మధు, ఆశా కార్యకర్త పురుడు పోశారు.