ఉమ్మడి,ఖమ్మం జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు.వైరా వ్యవసాయ మార్కెట్ ఆవరణ లో ఆరబోసిన పెసలు ను రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు మాట్లాడుతూ ఆగస్టు రెండో వారం నుంచి కురిసిన వర్షాలకు ఖరీఫ్ సీజన్లో వేలాది ఎకరాల్లో పెసర పంట కోయకుండా పోయింది.