రాష్ట్రంలో యూరియా కొరతకు నిరసనగా వైసీపీ మంగళవారం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి ఆపార్టీ నాయకులు హాజరు కాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోని మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు మావుడి రంగునాయుడు, జడ్పిటిసి మావుడి శ్రీనివాసరావు తో పాటు సాలూరు మండల పార్టీ అధ్యక్షుడు సువ్వాడ భరత్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, పార్టీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు తదితరులను పోలీసులు వారి ఇళ్ల వద్ద మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెడ్డి సురేష్ తదితరులు ఇంటివద్దే శాంతియుతంగా నిరసన తెలిపారు.