Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద 15వ ఆర్థిక నిధులతో అభివృద్ధి వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్

Chittoor, Chittoor | Dec 18, 2024
గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపిడిఓ లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్యం, హౌసింగ్, ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్, త్రాగునీరు సంబంధిత అంశాల పై ఎం పి డి ఓ లు ఆర్ డబ్ల్యూ ఎస్, హౌసింగ్ ఈ ఈ లు, డి ఈ లు, ఏ ఈ లతో చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి నియోజకవర్గాల వారీగా విడివిడిగా సంబంధిత అధికారులతో జెడ్ పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులుతో కలసి సమీక్ష నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us