ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన విజిలెన్స్ సమావేశం సోమవారం కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. అలానే జిల్లాలోని ఎమ్మెల్యేలు, టిడిపి ఇన్ ఛార్జ్ లు. ఈ సమావేశానికి హాజరై తమ ప్రాంతంలోని సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కలెక్టర్ మరియు ఎంపీ మంత్రి ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ దామోదర్ మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.