గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా తిప్పల దేవన్ రెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడ నుంచి నేరుగా రోడ్డు ద్వారా కూర్మన్నపాలెం జంక్షన్ కు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా గాజువాకలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వందల మంది కార్యకర్తలు నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు హాజరయ్యారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి వంచే ఎన్నికలలో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని తిప్పలు దేవాన్ రెడ్డి తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.