Araku Valley, Alluri Sitharama Raju | Aug 30, 2025
పోలవరం ప్రాజెక్టు నిర్మాసితులు పునరావాస కాలనీలకు తరలింపుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు అందించడానికి భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి రంపచోడవరం, చింతూరు డివిజన్ అధికారులు, తాహశీల్దారులు, పోలవరం పరిపాలనాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచిరు. రైతులకు ప్రత్యామ్నాయ భూములు సేకరణ, పునరావాసం, పునరేర్పాట్లుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్ని ఎకరాలకు ప్రతిపాదనలు వచ్చాయని అధికారులను ఆరా తీసారు.