అద్దంకి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 61 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి బాసటగా నిలుస్తుందని మంత్రి రవికుమార్ తెలియజేశారు.