హత్య చేసిన కేసులో నిందితుడైన రౌడీ షీటర్ బోయ తోట శివ కి జీవిత ఖైదు శిక్ష మరియు 5 వేల జరిమానాలను కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది తీర్పును వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో 2017వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అజం ఖాన్ సలాం భాష ను అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్ బోయ తోట శివ కత్తితో దాడి చేసి దారుణం పొడిచి హత్య చేయడం జరిగింది. ఈ కేసు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో నేరం రోజు కావడంతో నేడు రౌడీషీటర్ బోయ తోట శివ కు జీవిత ఖైదీతో పాటు 5000 జరిమానాలను విధించింది.