కళ్యాణదుర్గంలో శుక్రవారం ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ నవజాత శిశువును ముళ్ళ పొదల్లో వదిలి వెళ్లారు. గ్యాస్ గోడౌన్ సమీపంలోని ముళ్ళ పొదల్లో పసికందు ఏడుపు ను విన్న స్థానికులు వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు నవజాత శిశువును ఆసుపత్రికి తరలించారు. ఎవరో నవజాత శిశువును వదిలి వెళ్లారు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది మానవత్వం లేని ఓ తల్లి చేసిన పాపమని స్థానికులు చర్చించుకున్నారు.