సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 8న జడ్పిటిసి ,ఎంపిటిసి ఎన్నికల ఓటర్ జాబితాలపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మహేందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్న సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ఓటర్ జాబితా, ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితా పై తమ సలహాలు సూచనలు అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు