స్వర్గీయ గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషోద్ధారకుడు కాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ,ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాష విధ్వంసకులుగా తయారు కావడం దురదృష్టకరం, శోచనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు ,ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. వ్యావహారిక తెలుగు భాషోద్యమ పితామహుడు స్వర్గీయ గిడుగు రామమూర్తి పంతులు 162వ జయంతిని వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.