శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని కొక్కంటి క్రాస్ నుంచి అమడగూరుకు వెళ్లే రహదారిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన రామస్వామి, గోవిందు, చంద్ర నాయక్ లను అంబులెన్స్ ద్వారా కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.