రావులపాలెం మండలం, ఈతకోట అరుంధతి పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలో పెంకుటిల్లు దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కొత్తపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంపై రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.