రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై కదిరంపల్లి టోల్ గేట్ సమీపంలో కారు పల్టీ కొట్టింది. రాయదుర్గం వైపు నుంచి అనంతపురం వైపు వెళుతుండగా సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్టీరింగ్ కట్ కాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది. వారు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు.