నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సహోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం జండా మసీదు నుండి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ సాగిందని మండల కాజీ నూర్ అహ్మద్ తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.