సోంపేట పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందలాం అశోక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.