సోలార్ ఇండస్ట్రీ ల ఏర్పాటు ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు.గుత్తి మండలంలోని భేతాపల్లిలో ఏర్పాటైన సోలార్ ఇండస్ట్రీని రైతు సంఘం నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.గుత్తిలో మధ్యాహ్నం 12 గంటలకు విలేకరులతో మాట్లాడారు.సోలార్ ఇండస్ట్రీ వల్ల ఇండస్ట్రీస్ పెట్టినవారు లాభపడతారు తప్పా రైతులు ఒరిగిందేమీ లేదన్నారు.30 సంవత్సరాల పాటు భూములు లీజుకు తీసుకోవడం దారుణమైన విషయమన్నారు. భూములకు సంబంధించి రైతులు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తారన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే ఢిల్లీకి వెళ్లి పరిష్కారం చేసుకోవలసి ఉంటుందన్నారు.