శుక్రవారం ఉదయం.. విశాఖపట్నం నగరంపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. చినుకు చినుకుగా మొదలైన వర్షం క్రమంగా భారీ జడివానగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరమంతా వర్షంలో తడిసిపోయింది. తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ముఖ్యంగా సింహాచలం, మధురవాడ, పెందుర్తి వంటి ప్రాంతాలలో ఉన్న లోతట్టు కాలనీలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.