బొప్పాయి రైతుల సమ్మెతో లారీలు ఎక్కడి అక్కడే నిలిచిపోయాయి. నియోజకవర్గంలోని చిట్వేలు ఓబులవారిపల్లి కోడూరు మండలాల్లోని రైతులు బొప్పాయి లారీలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. కనీసం మద్దతు ధర కిలో ₹10 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.