నిరక్షరాస్యత రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త మిషన్‌గా సాగుతున్న అక్షర ఆంధ్ర (ఉల్లాస్) కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఒకరోజు శిక్షణ శిబిరం జరిగింది. జిల్లా మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఈ శిబిరానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకుడు కిరణ్ కుమార్, ఉపాధి హామీ సంస్థ ప్రాజెక్టు అధికారి సుధాకర్ రావు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి అరుంధతీ దేవి, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.