రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో తాడిపత్రి చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కాకినాడలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ పోటీలలో బిల్వికరెడ్డి మొదటి స్థానం, ముక్తేశ్వరి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. ముక్తేశ్వరి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్, బిల్విక రెండు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు కోచ్ సాంబశివ తెలిపారు. స్పీడ్ స్కేటింగ్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రశంసించారు.