భారీగా కురిసిన వర్షాలకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామ శివారులోని వాగుపై వరద నీరు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో సంబంధిత అధికారులు శుక్రవారం మాట్లాడుతూ వాగు పై వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని లేకుంటే ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది అన్నారు. వాగు పై వాహనాలు వరద నీటికి జారిపోతున్నాయని కావున జాగ్రత్తలు పాటించాలని సూచించారు.