భారీ వర్షాలకు వరదలలో నీట మునిగి నష్టపోయిన పంటలకు అధికారులు సర్వే నిర్వహించి నష్టపరిహారాన్ని అందించాలని జన్నారం,కడెం మండలాల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సోమవారం వారు మాట్లాడుతూ జన్నారం మండలంలోని గోదావరి పరివాహ ప్రాంతాల్లో గల పంటచేలలో వరద ఉధృతికి పంటలు నష్టపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని అలాగే కడెం మండలంలోని బెల్లాల్,నర్సింగాపూర్,లింగాపూర్ తదితర గ్రామాల పంటలు నీట మునిగి పంటలు పనికిరాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు నష్టం వాటిల్లని పంటలను సందర్శించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు.