Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, డిసీపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్ఎల్ వాహనాన్ని వెనక నుండి టాటా మ్యాజిక్ ట్రాలీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సెల్ వాహనంపై ఉన్న డీసీపల్లి గ్రామానికి చెందిన కడియం రామస్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం టోల్ ప్లాజా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టాటా మ్యాజిక్ వాహనాన్ని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.