తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునపాక గ్రామంలో ఆదివారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. సమస్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో హరిజనవాడ గ్రామస్తులు సమస్యను విన్నవించారు. గ్రామస్తుల విన్నపం మేరకు 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని హరిజనవాడ గ్రామ ప్రజల కోరిక మేరకు సర్వే చేయించి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ శ్రీ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు