వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక ఆదివారం కల్లూరులో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన సతీమణి ఉమామహేశ్వరమ్మ, యువ నాయకుడు శివ నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.