ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో క్యాంపు కార్యాలయంలో మంగళవారం బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జి రితీష్ రెడ్డి కాశి నాయన మండల నాయకులు బసిరెడ్డి రవీంద్రరెడ్డి నారా లోకేష్ తో బేటి అయ్యారు.వారు మంత్రి లోకేష్ తో మాట్లాడుతూ జ్యోతి క్షేత్రానికి ఉన్న ఆటంకాలను తొలగించి జ్యోతి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని విన్నపం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో మాట్లాడి జ్యోతి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు.