సమాజంలో సంస్కరణలకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకుని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శాఖ గ్రంథాలయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు గుర్రం జాషువా జయంతోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా జయంతోత్సవాలను నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. నిర్వాహకులు రంగసాయి, ఉషారాణి పాల్గొన్నారు.