అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు లో ఉన్న మయూరి హోటల్ వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో అనంతపురం నగరంలోని తపోవనంకు చెందిన జయ కిషోర్ ఆచారి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం అతను స్పృహలో లేడని వైద్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.