ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణ తెలుగు యువత అధ్యక్షునిగా దొడ్డ దుర్గేశ్ రెడ్డి ని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో టిడిపి విజయానికి మరియు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేసిన దుర్గేశ్ రెడ్డి ని పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా నియమించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో పార్టీ కోసం మరింత కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.