విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలోని డయేరియా వైద్య శిబిరంలో డయేరియా బాధితుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్య శిబిరంలో డయేరియా బాధితుల కు వైద్యం సరిగా అందటం లేదని బాధిత బుట్ట నాగలక్ష్మి అనే పేషెంట్ ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని బాధితులు నిలదీశారు. బాధితులు మద్దతుగా డిఎంహెచ్వో ను వైసీపీ నేతలు నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై వైసీపీ నేతలు బాధితులు ఫైరయ్యారు.