ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు శుక్రవారం ఎస్ఐ నరసింహారావు అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి తర్వాత రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినీలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై వివరించి జాగ్రత్తగా తీసుకోవాలని తెలిపారు. తమ పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే డైలీ 100 ద్వారా సమాచారం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి మీ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థినీలకు తెలిపారు.