గూడూరు మండలం, కే నాగలాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఫ్లోరోసిస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ వ్యాధి వలన దంతాల మీద పసుపు రంగులో చారలు ఏర్పడతాయన్నారు. దంతాలు గోధుమ రంగులో ఉండడం, చిగుళ్ల మధ్యలో నల్లగా ఉండడం, చాక్ పీస్ రంగులోకి మారి దంతాలు పిప్పిపళ్ళుగా మారుతాయన్నారు. దీని వలన ఆహారం నమల లేకపోవడం, తలనొప్పి రావడం, దంతాలకు రంధ్రాల వలన పోషకాహారం తీసుకోలేకపోవడం జరుగుతుందన్నారు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు.