తాటిపూడి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం క్రమేపి పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నాటికి 295.5 అడుగులకు నీటిమట్టం పెరిగింది. జలాశయం లోకి ప్రస్తుతం 480 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 297 అడుగులు. జలాశయం నీటిమట్టం 295.5 అడుగులకు పెరగడంతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు ఒక గేటు తెరచి గోస్తని నదిలోకి నీరు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. .