Parvathipuram, Parvathipuram Manyam | Aug 25, 2025
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, లాప్టాప్ లను పంపిణీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.