జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బైకర్ సూరారం నుంచి జీడిమెట్ల వెళ్తుండగా స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్డు పక్కన స్తంభాన్ని ఢీకొట్టాడు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడు వెంకటరామిరెడ్డి నగర్ కు చెందిన సాయిగా గుర్తించారు.