అల్లూరి ఏజెన్సీలో నిర్మించనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు భారీ నిర్వహించారు. ఆదివాసి గిరిజన సంఘం నేతలు పొద్దు బాల్ దేవ్, కిల్లో సురేంద్ర, అనంతగిరి జడ్పిటిసి గంగరాజు ఆధ్వర్యంలో హుకుంపేట మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సుమారు 1000 మంది స్థానిక గిరిజంతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా ప్రాజెక్టుకు అనుబంధంగా ఇచ్చిన జీవో నెంబర్ 51 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో ఉద్యమ ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు.