వడ్డెర కులస్తుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని కుల సంఘం నేతలు పేర్కొన్నారు. కుప్పం జమీందారీ పార్కులో ఆదివారం వడ్డెర కులస్తులు సమావేశమయ్యారు. ఏపీ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మల్లె ఈశ్వర్ బాబు, వడ్డెర కుల రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు వడ్డే వెంకట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో కుప్పంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం అధ్యక్షుడు మాధవ్ తెలిపారు.