సొంతింటి కల కోసం సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నారని ఇందులో సీఐటీయూ చేసిన ఓటింగ్ బ్యాలెట్ లో 95శాతం పాల్గొన్నారని సీఐటీయూ అధ్యక్షులు రాజారెడ్డి, మెండే శ్రీనివాస్ లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి కార్మికులందరికీ సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలోCitu రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, మెండే శ్రీనివాస్, బిక్షపతి, ఆరేపల్లి రాజమౌళి, శిమరం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.