కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆసరా పింఛన్లు రెండింతలు చేస్తామని వికలాంగులకు 6000 ఇస్తామని ఇచ్చిన హామీని రెండు సంవత్సరాలు అధికారంలో వచ్చిన అమలు చేయకపోవడం నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నాయకులు సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు రేపు నిర్వహించగలరు పింఛన్ పొందుతున్న వారందరూ రావాలన్నారు