అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం సముద్ర ఉత్పత్తుల ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూలతలను తీసుకువస్తుందని నిపుణులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రం నుంచి ఏటా సుమారు రూ. 25 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఈ భారీ వ్యాపారం కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం కేంద్రంగా నడుస్తోంది. అయితే, ట్రంప్ ప్రభుత్వం విధించిన ఏకంగా 50 శాతం సుంకాల భారం, రొయ్యలు, చేపల ఎగుమతి కంపెనీలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.